లాక్ డౌన్ కారణంగా తమ జీవితాలు దుర్భరంగా మారిపోయాయని, ఆరు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రైవేటు టీచర్లు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ… అసెంబ్లీని ముట్టడించారు.
ఆరు నెలలుగా తమ యాజమాన్యాలు జీతాలు ఇవ్వటం లేదని, ప్రభుత్వమే స్కూల్స్ టీచర్లకు జీతాలు ఇచ్చేలా చొరవ తీసుకోవాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం అయినా ఆదుకోవాలని లేదా యాజమాన్యలకు ఉత్తర్వులిచ్చి కేసీఆర్ జీతాలైన వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. నల్గొండ, జగిత్యాల జిల్లాలకు చెందిన టీచర్లు అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్నారు. తెలంగాణలో మూడు లక్షలకు పైగా ప్రైవేటు టీచర్లు నిరుద్యోగులుగా మారిపోయారని, తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.