టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలను గొప్పగా అభివృద్ధి చేస్తోందని.. పల్లె పకృతి వనాలు, అందమైన వైకుంఠధామాలే అందుకు నిదర్శనమని కాలర్ ఎగరేసి మరీ చెబుతుంటారు మంత్రి కేటీఆర్. ఇటీవల బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేస్తానని ప్రకటన చేసినప్పుడు కూడా.. ఊరూరా పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు ఎలా నిర్మించామో చూసి రండి అంటూ ఆయనకు సెటైర్ కూడా వేశారు.తాజాగా ట్విట్టర్ వేదికగా కొందరు టీఆర్ఎస్ నేతలు కూడా అలాగే గొప్పలు చెప్పుకునేందుకు ప్రయత్నం చేయగా నెటిజన్లు.. తీవ్రమైన కౌంటర్లతో విరుచుకుపడ్డారు.
ఓ గ్రామంలోని వైకుంఠధామం ఫోటోలను షేర్ చేస్తూ.. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఇదీ అన్నట్టు కొందరు టీఆర్ఎస్ లీడర్లు ట్విట్టర్‌లో పోస్ట్‌ను కేటీఆర్‌కు ట్యాగ్ చేయగా.. దాన్ని కేటీఆర్ లైక్ చేశారు. దీంతో అది ట్విట్టర్ వాల్‌పై ప్రత్యక్షం కాగా.. కేటీఆర్‌ను ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. ఏవరైనా గ్రామాల్లో ఆస్పత్రి నిర్మించామనో.. అనాధాశ్రమాలు కట్టించామనో.. స్కూళ్లకు కొత్త భవనాలు కట్టించామనో గొప్పగా చెప్పుకుంటారు.. కానీ టీఆర్ఎస్ వైకుంఠధామాన్ని నిర్మించడం కూడా అభివృద్ధిగా చెప్పుకోవడం సిగ్గుచేటు అంటూ కామెంట్ చేస్తున్నారు. పరోక్షంగా తెలంగాణలో చచ్చాకే.. ప్రశాంతత దొరుకుందని చెప్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. వర్షకాలంలో రోడ్డు పక్కన కూడా పచ్చగానే ఉంటుందని, దాన్ని కూడా తమ గొప్పతనమే అనుకోవడం టీఆర్ఎస్‌కే చెల్లిందంటూ సెటైర్లు వేస్తున్నారు.
Telangana is the only State in the country where almost all gram panchayats has a ‘Vaikunta dhamam’ – final resting place for people to cremate their near and dear ones in a decent ambience with all required facilities
Vaikunta dhamam at Nellutla GP of Lingalaghanpur Mandal👇 pic.twitter.com/eAIFjq9kOW
— Enugu Bharath Reddy (@BharathReddyTRS) September 5, 2021
చూడగానే పార్క్అనుకున్న కానీ కాదు… చివరి మజిలీ అయ్యాక శాశ్వత విశ్రాంతి ను ఇచ్చే వైకుంఠధామం.. జనగామ జిల్లా నెల్లుట్ల గ్రామంలో TRS గవర్నమెంట్ నిర్మించింది…@KTRTRS pic.twitter.com/kV9U5SZ0NV
— ashapriya mudiraj (@ashapriya09) September 5, 2021
Advertisements