ఆర్టీసీ కార్మికుల బ్రతుకులు ఇంతేనా… ఎందుకు సమ్మె చేశారు,ఎందుకు విరమించారు… అందరి మధ్యలో ఇదే చర్చ. కార్మికులు ఓడిపోయారా…ముఖ్యమంత్రి ఓడిపోయారా.. అసలు గెలిచింది ఎవరు…? ఒక సగటు పౌరుడి మదిలో ఉన్న ప్రశ్న.
ఇక్కడ ఎవ్వరూ గెలువరు ఇది నా మాట. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో హక్కుల కోసం, బ్రతుకు జీవన కోసం, సంబంధించిన సంస్థల బ్రతుకు కోసం, ప్రతి పౌరుడు కొట్లాడుతాడు, అందుకే ఈ కార్మికులు పోరాటం చేశారు. ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీఅనే సంస్థను కాపాడమని, వారి సమస్యలు పరిష్కరించాలని పోరాటం చేస్తున్నారు, ఆర్టీసీని సీమాంధ్ర వాళ్ళు 60 సంవత్సరాలు కాపాడితే, తెలంగాణ ముఖ్యమంత్రి 6 సంవత్సరాలకె ఎత్తివేయటం జరుగుతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ప్రతి సమస్యకు ఒక పరిష్కార మార్గం చూపాలి, అవసరం అయితే అఖిలపక్షం నిర్వహించాలి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ లేదు.
అందుకే కార్మికులు ఓడిపోలేదు, ఇది మన పాలన, మన ముఖ్యమంత్రి, మన రాష్ట్రం.. రాష్ట్రం కూడా నష్టాల్లో ఉంది కదా…. మరి ముఖ్యమంత్రి 4 లక్షల పై చిలుకు జీతం ఎందుకు తీసుకుంటున్నారు, అది కూడా ఆలోచించాలి. నాకు తెలిసి సేవా రంగం అనేది ఏదైనా లాభాలు రావు, లాభాలతో ముడిపడి ఉండదు. ఇది ముఖ్యమంత్రి కి తెల్వదా..తెలుసు. కానీ ఆర్టీసీ ఆస్తులను దోచుకోవడానికి కేసీఆర్ ఈ కుట్రలు చేస్తున్నారని అర్థం అవుతోంది. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ తన చూపు 12వేల పాఠశాలల భూములపై ఉందని అర్థమవుతోంది. సీమాంధ్ర వాళ్ళు 60 సంవత్సరాలు దోచుకున్నారని రాష్ట్రం కోసం పోరాటం చేశాము… రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు ఎవరిపై పోరాటం చేయాలి…? మనం ఒక్కసారి ఆలోచించాలి.
ఆర్టీసీ సామాన్య ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వ పాఠశాలలు పేద వర్గాల పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడతాయి, విద్యార్థుల కు ఫీజులు ఇవ్వరు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వరు, ఉన్న ఉద్యోగాలు తొలగిస్తారు… రైతులకు మద్దతు ధర ఇవ్వరు, ఇవ్వన్ని పేద వర్గాలకు సంబంధించిన కష్టాలు. ఇంత జరుగుతుంటే మనుషుల మధ్య మానవత్వం చచ్చి పోయిందా…ఎందుకు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సామాన్య ప్రజలు మద్దతు తెలపడం లేదు, వాళ్ళ పోరాటానికి మద్దతు తెలుపకపోగా, వారి జీవితాలను ఎందుకు ఆగం చేస్తున్నారు, తాత్కాలిక డ్రైవర్ లు, కండక్టర్ లు మీరు పని చేయొద్దు ఒక్కసారి ఆలోచించాలి, ఈ విధంగా పాలన ఉంటే సామాన్య పౌరుడు తెలంగాణలో బ్రతుకుతారా, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది చనిపోయారు, ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు, తాత్కాలిక డ్రైవర్ ల వల్ల ఈ మధ్యలో సామాన్య ప్రజలు చచ్చిపోతున్నారు, రైతులు చచ్చిపోతున్నారు, ఆర్టీసీ కార్మికులు చచ్చిపోతున్నారు.
అందుకే నిరంకుశ ముఖ్యమంత్రి కి, అమాయక ప్రజలకు జరుగుతున్న పోరాటం ఇది. అందుకే సామాన్య ప్రజలు ఆలోచించాలి. ఆర్టీసీకి మద్దతు తెలుపాలి. ఆర్టీసీ మనది. సామాన్య ప్రజలది. ప్రభుత్వ పాఠశాలలు మనవి,పేద వర్గాల పిల్లలు చదువుకోవడం కోసం… రైతులకు మద్దతు ధర కావాలి, రైతు బాగుండాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి,విద్యార్థుల కు ఫీజులు ఇవ్వాలి, అందుకే అందరం కలిసి పోరాటం చేయాలి, వీరి కోసం పోరాటం చేయాలి, ముఖ్యమంత్రి కళ్లు తెరిచే విదంగా ఏకమైతే… అరాచక,తెలివి లేని కేసీఆర్ దిగి రాక తప్పదు.
అందుకే మన రాజకీయ పార్టీలు,కవులు,మేధావులు, కళాకారులు, ప్రజాసంఘాలు,విద్యార్థి సంఘాలు, జర్నలిస్ట్ లు,డాక్టర్ లు,లాయర్ లు, కుల సంఘాలు, మిగతా అన్ని వర్గాల వారు ఏకం కావాలి, ప్రగతి భవన్ కు లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చి కేసీఆర్‌ను దిగ్బంధం చేయాలి, మరోక్కసారి…తెలంగాణ ఉద్యమ స్పూర్తితో ఉద్యమిద్దాం, మన హక్కుల కోసం కొట్లాడుదాం,తెలంగాణ రాష్ట్రంను కాపాడుకుందాం… అందరు ఆలోచిస్తారని ఆశిస్తున్నా…..
ఇట్లు మీ నిజ్జన రమేష్ VJS రాష్ట్ర కన్వీనర్ , ఉస్మానియా యూనివర్సిటీ