మూడు రాజధానులు వ్యతిరేకంగా రాజధాని అతిథులు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరో వైపు ప్రభుత్వం మాత్రం రాజధాని తరలింపుపై చెయ్యవలసిన పనులను చేస్తూనే ముందుకు వెళ్తుంది. రాజధాని రైతులకు తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు మద్దతు పెరుగుతూ వస్తుంది. రాజధాని రైతులకు మద్దతుగా హైదరాబాద్ కూకట్ పల్లి వసంతనగర్ పరిసర ప్రాంత వాసులు సంఘీభావం తెలిపారు. ఒక రాజధాని ముద్దు మూడు రాజధానులు వద్దు, అనే నినాదంతో రాష్ట్రంలోని 13 – జిల్లాల ప్రజలే కాకుండా హైదరాబాదులో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నారు,అమరావతిలో రాజధాని ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని తెలిపారు.