గ్రామీణ ప్రాంతాల్లో వేసిన లే అవుట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేయడంపై తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ మండిపడింది. నెలలు గడుస్తున్నా రిజిస్ట్రేషన్లకు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోందని ఆరోపిస్తోంది. చాలాచోట్ల ప్రజలు ప్లాట్లు కొనుగోళ్ల కోసం అడ్వాన్సులు ఇచ్చారని, కానీ ప్రభుత్వం మాత్రం రిజిస్ట్రేషన్లు నిలిపివేసి చోద్యం చూస్తోందని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈనెల 27 రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రియల్టర్లతో కలిసి సచివాలయం ముట్టడించేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. 33 జిల్లాలకు చెందిన రియల్టర్లు ఈ కార్యక్రమానికి తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » అవీ ఇవీ... » సచివాలయం ముట్టడికి రియల్టర్ల అసోసియేషన్ పిలుపు