తెలంగాణలో రోజురోజుకీ నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. గజానికో గాంధారి పుత్రుడు.. కిలోమీటర్ కో కీచకుడు తయారవుతున్నాడు. దానికి కారణం విచ్చలవిడిగా మద్యం, గంజాయి, డ్రగ్స్ అమ్మకాలే. వాటికి భానిసలై చాలామంది విచక్షణ కోల్పోతున్నారు. అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఆరేళ్ల గిరిజన బాలిక విషయంలోనూ అదే జరిగింది. దీంతో ఆనాడు దిశకు జరిగిన న్యాయమే ఈనాడు ఈ బాలికకు జరగాలని వాడవాడలా డిమాండ్లు వినిపిస్తున్నాయి.
బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని.. హాయత్ నగర్ అంబేద్కర్ చౌరస్తాలో కొవ్వొత్తులతో నిరసన తెలిపింది తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు.