తెలంగాణకు 20 వేల కోవాక్జిన్ డోసులు చేరాయి. ఈనెల 16 నుంచి ప్రారంభంకానున్న వ్యాక్సినేషన్ లో భాగంగా 139 సెంటర్లలో వ్యాక్సినేషన్ ఇస్తారు. అయితే మొదటి విడత వ్యాక్సిన్ కేంద్రాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దశలవారిగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో వాక్సిన్ ఇవ్వనున్నారు.
మంగళవారం కోవిషీల్డ్ వ్యాక్సిన్ సరఫరా చేసిన అధికారులు… బుధవారం కోవాక్జిన్ వ్యాక్సిన్ ను వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేశారు. తెలంగాణలో ఇప్పటి వరకు వ్యాక్సిన్ కోసం 3.32లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు.
తెలంగాణకు చేరిన రెండు కంపెనీల వ్యాక్సిన్స్ కోఠిలోని వ్యాక్సిన్ భవన్ లో ఉన్నాయి. అక్కడి నుండి 16వ తేదీ ఉదయం వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చేరనున్నాయి. జిల్లాల్లో వ్యాక్సిన్ సెంటర్లను ఇప్పటికే అధికారులు గుర్తించారు.