తెలంగాణలో కరోనా తీవ్రత అలాగే కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 59 వేల 421 టెస్టులు చేయగా.. కొత్తగా 2892 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 30 వేల 589కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందగా… మొత్తం కరోనా మరణాల సంఖ్య 846 కి చేరింది.
మరోవైపు నిన్న 2,240 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిలింది. దీంతో ఇప్పటి వరకు 97 వేల 402 మంది డిశ్చార్జ్ అయినట్టయింది. ప్రస్తుతం 32 వేల 341 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇందులో 25 వేల 271 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
ఇక జిల్లాల వారీగా కేసుల వివరాలను చూస్తే.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 477 నమోదయ్యాయి. ఆ తర్వాత . అత్యధికంగా రంగారెడ్డి- 234, మేడ్చల్-192, నల్గొండ జిల్లాలో 174 కేసులు వెలుగుచూశాయి.