తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 165 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,97,278 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,623కి చేరింది. కరోనా నుంచి ఇప్పటి వరకు 2,93,940 మంది బాధితులు కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 1,715 యాక్టివ్ కేసులు ఉన్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీలో కొత్తగా 35 కేసులు నమోదు అయ్యాయి.