తెలంగాణలో గడిచిన 24గంటల్లో 41,246మందికి కరోనా పరీక్షలు చేయగా… 379కొత్త కేసులు నిర్ధారించినట్లు ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా మరో 305మంది కరోనా నుండి కోలుకున్నారు. చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించారు.
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య- 2,88,789
యాక్టివ్ కేసుల సంఖ్య- 5,053
డిశ్చార్జ్ అయిన వారు- 2,82,177
మరణాలు- 1559
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 71కేసులు నమోదయ్యాయి.