తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆదివారం కావటంతో టెస్టుల సంఖ్య కూడా తగ్గించేశారు. ప్రభుత్వం విడుదల తాజాగా హెల్త్ బులిటెన్ ప్రకారం…. తెలంగాణలో కొత్తగా 99 కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా వైరస్ కు చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 2,96,673కి చేరుకుంది. కరోనా మరణాల సంఖ్య 1,618కు చేరుకుంది.