దీపావళి కావడంతో నిన్న తెలంగాణలో కరోనా టెస్టుల సంఖ్య తగ్గింది. దీంతో కేసులు కూడా భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 21 వేల 264 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 661 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడిన బాధితుల సంఖ్య 2 లక్షల 57 వేల 374కి పెరిగింది.
మరోవైపు కరోనాతో నిన్న ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1404కి పెరిగింది. ఇక కరోనా బారి నుంచి నిన్న 1637 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీలు 2 లక్షల 40 వేల 545కి చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 15 వేల 425 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 12 వేల 888 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.