తెలంగాణలో కొత్తగా 52,308మందికి కరోనా పరీక్షలు చేయగా 635మందికి పాజిటివ్ గా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. కొత్తగా 565మంది కోలుకోగా, మరో నలుగురు మరణించారు.
తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య-2,77,151
యాక్టివ్ కేసుల సంఖ్య- 7670
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య- 2,67,992
మొత్తం మరణాలు- 1489
తెలంగాణలో ఇప్పటి వరకు 60,81,517మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇక కొత్తగా వచ్చిన కేసుల్లో గ్రేటర్ లో 141కేసులు నమోదయ్యాయి. కొంతకాలంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది.