తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 14,744 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 114 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,97,712కి పెరిగింది. నిన్న కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటిదాకా 1,625 మంది చనిపోయారు.
కరోనా బారి నుంచి తాజాగా 143 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,94,386కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,701గా ఉంది. ఇప్పటిదాకా తెలంగాణలో 84,71,684 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.