తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 24,785 మందికి పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 224 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గ్రేటర్ పరిధిలో అత్యధికంగా 56 కేసులు వెలుగుచూశాయి. నేడు నమోదైన వాటితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2,90,008కి చేరింది. ఇక కరోనాకు చికిత్స పొందుతూ నిన్న ఒకరు మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 1,566కి పెరిగింది.
కరోనా నుంచి తాజాగా 461 మంది కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటి వరకూ 2,83,924 మంది కరోనాను జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,518 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 2,439 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.