తెలంగాణలో కరోనా ఉధృతి మరింతగా పెరిగింది. క్రమంగా 3 వందల మార్క్ కు చెరువవుతోంది. గడిచిన 24 గంటల్లో 59,905 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 278 మందికి పాజిటివ్ తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,047కి చేరింది.
అటు కరోనా కారణంగా నిన్న ముగ్గురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ మహమ్మారి కారణంగా చనిపోయిన వారి సంఖ్య 1662కి చేరింది. తాజాగా కరోనా బారి నుంచి నిన్న 111 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం డిశ్చార్జిలు 2,98,120కి పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 2,265 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 94.19 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.