తెలంగాణలో కరోనా వైరస్ క్రమంగా విజృంభిస్తోంది. చూస్తుండగానే కేసులు మళ్లీ మూడు వందల మార్క్ దాటేశాయి. గడిచిన 24 గంటల్లో 62,972 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 313 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. అటు కరోనా కారణంగా నిన్న ఇద్దరు మరణించారు. తాజా కేసులతో తెలంగాణవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య సంఖ్య 3,02,360కి చేరుకుంది. ఇక కరోనాతో రాష్ట్రంలో మొత్తం 1664 మంది ప్రాణాలు కోల్పోయారు.
కరోనా బారి నుంచి తాజాగా 142 మంది బయటపడ్డారు. ఇప్పటివరకు 2,98,262 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2434 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 943 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తెలంగాణలో కరోనా మృతుల రేటు 0.55 శాతం ఉండగా, రికవరీ రేటు 98.64గా ఉంది.