తెలంగాణ కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న 33 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 593 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న జీహెచ్‌ఎంసీ పరిధిలో 119 కరోనా కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ – 55, రంగారెడ్డి – 61 కేసులు వెలుగులోకి వచ్చాయి
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 69 వేల 816కి చేరింది. నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,458కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1058 మంది కోలుకున్నారు. వీటితో కలిపి రికవరీలు 2 లక్షల 58 వేల 336కి పెరిగాయి.
ప్రస్తుతం తెలంగాణలో 10,022 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 7,946 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.