తెలంగాణ కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. దాదాపు నెలన్నర రోజులుగా .కేసులు ఒకేలా నమోదవుతున్నాయి. టెస్టులు 40 వేల నుంచి 45 వేల మధ్య చేస్తుండగా.. కొత్త కేసులు 300-600 మధ్య బయటపడుతున్నాయి. గడచిన 24 గంటల్లో 40,190 కరోనా నిర్థరణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 394 పాజిటివ్ కేసులు బయటపడినట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ముగ్గురు మృతి చెందారు. అటు తాజాగా ఈ వైరస్ బారి నుంచి 574 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 2,87,502 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. 1,549 మంది మరణించారు. మొత్తం బాధితుల్లో 2,80,565 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,388 ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపుగా 70 లక్షల మందిని పరీక్షించారు.