తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 37,451 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 351 మందికి పాజిటివ్ అని తేలింది. వీటితో కలిపి మొత్తం కేసులు 2 లక్షల 89 వేల 784కి పెరిగాయి. అటు నిన్న కరోనాతో నిన్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాలు 1,565కి పెరిగాయి.
తాజాగా కరోనా నుంచి నిన్న 415 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం డిశ్చార్జీలు 2,89,784కి చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 4,756 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందెలొ 2,584 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 7.,53 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.