లాక్ డౌన్ మొదటిరోజు నుండి డిపోలకే పరిమితమైన బస్సులు ఈనెల 17లేదా వచ్చే వారం నుండి రోడ్డెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి .ఇవాళ రేపు సీఎం కెసిఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు . రెడ్ జోన్ లు, కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో బస్సులు నడిపే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం .దీనికి సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే సిబ్బందికి తగు సూచనలు చేశారు .ఇప్పటికే సంస్థ ఆర్ధిక నష్టాల్లో కురుకుపోతోందని అదియూకారులు అంటున్నారు .
బస్సుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బస్సులను పూర్తిగా శానిటైజ్ చేస్తారు .
బస్సు ఎక్కే ప్రతి ప్రయాణీకుడిని థర్మల్ స్క్రీన్ చేస్తారు . శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటె అనుమతించరు .
ముఖానికి మాస్కు ఉంటేనే బస్సులోకి అనుమతి .
బస్సు ఎక్కకముందే కండక్టర్ దగ్గర టికెట్ తీసుకోవాలి.
బస్ స్టాప్ ల దగ్గర జనం గుమిగూడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు .
భౌతిక దూరం పాటించేలా సీట్లకు నంబర్స్ కూడా వేస్తున్నారు . నంబర్ ఉన్న దగ్గరే ప్రయాణీకులు కూర్చోవాలి .
బస్సులో కేవలం 50 శాతం కెపాసిటీతో బస్సులు నడి పిస్తారు .
పల్లె వెలుగు బస్సుల్లో 56 సీట్లు ఉండగా , 25 నుండి 30 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది .
ఎక్ష్ప్రెస్స్ బస్సుల్లో 49కి 25 మంది , లక్సరీ బస్సులో 49 సీట్లకు , 17మందిని మాత్రమే ఎక్కించుకుంటారు .