ఈనెల 18 వ తేదీన మహాశివరాత్రి పర్వదినం కావడంతో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకున్నది. మహాశివరాత్రి రోజున ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ నుండి శ్రీశైలం వరకు ఈనెల 16 వ తేదీ నుండి 19 వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నారు.
మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్, దిల్‌షుఖ్‌నగర్ బస్‌స్టేషన్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎస్ పాయింట్ల నుండి ఈ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ తెలియజేసింది.
ఈ పండుగ పర్వదినం పురస్కరించుకొని మొత్తం 390 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఫిబ్రవరి 16వ తేదీన 36, 17వ తేదీన 99 బస్సులు, 18వ తేదీన 99, 19వ తేదీన 88 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ తెలియజేసింది. సంక్రాంతి సందర్భంగా తెలంగాణ నుండి ఏపీకి ప్రత్యేక బస్సులను నడిపిన సంగతి తెలిసిందే.
ఈ ప్రత్యేక సమయాల్లో పెద్ద సంఖ్యలో ప్రత్యేకమైన బస్ సర్వీసులను నడపడం ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ఆర్టీసీ అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు పక్కా ప్రణాళికలతో వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నది.