తెలంగాణ సర్కార్ తీరుతో పాటు కేసీఆర్, కేటీఆర్ లపై మరోసారి టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా.. 30 లక్షల మంది యువకుల భవిషత్తుకు సంబంధించిన ఇష్యూ అయిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పై ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ ఎందుకు నోరు విప్పలేదని ఆయన మండిపడ్డారు.
ఏది జరిగినా ప్రభుత్వానికి సంబంధం లేదని డైలాగ్ కొట్టడం కేటీఆర్ కు అలవాటై పోయిందని ఆయన విమర్శించారు. ఈ పేపర్ లీకేజ్ లో తన కొడుకుకు సంబంధం ఉండడంతోనే కేసీఆర్ నోరు విప్పడం లేదని బండి సంజయ్ ఆరోపించారు. అదే విధంగా బిడ్డ లిక్కర్ స్కాం పై కూడా కేసీఆర్ మాట్లాడడం లేదన్నారు.
మంత్రి కేటీఆర్ ను ఎందుకు కేసీఆర్ బర్తరఫ్ చేయడం లేదని బండి సంజయ్ నిలదీశారు. ఏది ఏమైనా ఈ కేసులో ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వెనుక అధికార పార్టీ లీడర్ల హస్తముంది ఆరోపించారు. దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు జరిగేది తెలంగాణలోనే అని అన్నారు బండి.
ఇక పేపర్ లీకేజీలో పెద్దలను పక్కనేసి చిన్నోళ్లను మాత్రం అరెస్ట్ చేసి కేస్ ను క్లోజ్ చేయడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని బండి ఆరోపించారు. పేపర్ లీకేజీలో తప్పకుండా పెద్దల హస్తముందని అన్నారు. సిట్టింగ్ జడ్జితో ఎందుకు కేసును విచారణ చేయించడం లేదో కేసీఆర్ చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నష్టపోయిన విద్యార్థులకు లక్ష చొప్పున ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.