తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. రాష్ట్రంలో విద్యా సంస్థలకు సెలవులను పొడిగించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈనెల 17న స్కూల్స్ రీ ఓపెన్ అవ్వాల్సి ఉండగా.. కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజులు సెలవులను పొడిగించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ కూడా సెలవులు పొడిగించాలని ప్రభుత్వానికి సూచించిందని అధికారిక వర్గాల్లో వినిపిస్తుంది.
20వ తేదీ వరకు రాష్ట్రంలో రాజకీయ పార్టీల ర్యాలీలు, సభలను జరపరాదని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. స్కూల్స్ సెలవులు కూడా 20వ తేదీ వరకు కొనసాగిస్తారని తెలస్తోంది. అయితే కరోనాలో తీవ్రత తగ్గకపోతే.. దీనిపై మరోసారి నిర్ణయం తీసుకుంటారట. సెలవులు పొడిగాస్తారే వార్తాలు చక్కర్లు కొట్టడంతో.. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారిలో ఉత్కంఠ మొదలైంది. సెలవులపై త్వరగా ప్రభుత్వం ప్రకటన చేస్తే.. కొన్ని రోజులు సొంతూర్లలో ఉండి వద్దాం అని అనుకుంటున్నారు.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,398 మంది కరోనా బారినపడ్డారు. కొత్తగా నమోదైన కేసుల్లో ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1,233 కేసులు బయటపడగా.. రంగారెడ్డి జిల్లాలో 192, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 191 కేసులు వెలుగుచూశాయి. కొత్తగా ముగ్గురు ఈ వైరస్ బారినపడి మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 4,052కి చేరింది. తెలంగాణలో ఈ రికవరీ రేటు గణీనీయంగా ఉంటుంది. ఈ రోజు కొత్తగా 1,181 మంది కోలుకోగా.. ఇప్పటివరకు 6,79,471 మంది కోలుకున్నారు. ఇంకా 21,676 మంది చికిత్స పొందుతున్నారు.