కరోనా కష్టకాలంలోనూ న్యూ ఇయర్ వేడుకలు రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించాయి. న్యూ ఇయర్ వేడుకల కోసం రాష్ట్రవ్యాప్తంగా మందుబాబులు 760కోట్ల లిక్కర్ తాగేశారు. అవును అబ్కారీశాఖ లెక్కల ప్రకారమే 759కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాదితో పోల్చితే 200కోట్ల రూపాయలు అధికంగా ఖర్చు చేయటం విశేషం.
న్యూ వేడకల పార్టీలు ప్రారంభం అయిన నాలుగు రోజుల మద్యం అమ్మకాలు చూస్తే 8.61 కోట్ల లిక్కర్ కేసులు , 6.62 కోట్ల బీరు కేసులు అమ్ముడుపోయాయి. డిసెంబర్ 28న 205.18 కోట్లు, డిసెంబర్ 29న 150 కోట్లు, డిసెంబర్ 30న 211.35 కోట్లు, డిసెంబర్ 31న193కోట్ల విలువైన మద్యాన్ని మంచి నీళ్లలా తాగేశారు. ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఏకంగా 300 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది.
తెలంగాణలోని ఇతర రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు చూస్తే…
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 50.78కోట్లు,
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 52.70కోట్లు,
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 47.78కోట్లు,
ఉమ్మడి మెదక్ జిల్లాలో 53.87కోట్లు,
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 75.98కోట్లు,
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 37.5 కోట్లు,
ఉమ్మడి వరంగల్ జిల్లా జిల్లాలో 63.49 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ వర్గాలు ప్రకటించాయి.
ఈసారి కరోనా ఆంక్షలున్నాయని ప్రభుత్వం, తెల్లవారే వరకు డ్రంకన్ డ్రైవ్స్ చేస్తామని పోలీసులు హెచ్చరించినా మందుబాబులు ఫుల్లుగా తాగేశారు.