ఎయిడ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో నిర్వహించిన ప్రపంచ ఎయిడ్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దీనిపై అవగాహన పెరగటం వల్ల 90 శాతం మరణాలు తగ్గుతాయన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో ఎయిడ్స్ శాతం 0.7 ఉండేది.. తర్వాత చేపట్టిన చర్యలతో 0.4 శాతానికి తగ్గిందని చెప్పారు.
ఎయిడ్స్‌పై చేస్తున్న పోరాటంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమైందన్నారు హరీశ్ రావు. బాధితులను అందరం కలిసి కాపాడుకోవాలని చెప్పారు. చెస్ట్ ఆసుపత్రి పరిసరాల్లో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం త్వరలో శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. అలాగే హైదరాబాద్ నలువైపులా 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తున్నట్లు వివరించారు హరీశ్.