కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు త్వరలో వ్యాక్సిన్ రానుందన్న ఊహాగానాల నేపథ్యంలో.. కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం కమిటీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రస్థాయిలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసింది. సీఎస్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయగా, వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమించింది.
ఇక జిల్లాల్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మండల స్థాయిలో ఎంపీడీవోలను అధ్యక్షులుగా చేస్తూ టాస్క్ ఫోర్స్ కమిటీలు ప్రకటించింది. ఈ కమిటీల పర్యవేక్షణలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ, రవాణ, సరఫరా చేయనున్నారు.