తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2023-24కు సంబంధించిన అకడమిక్ ఇయర్ క్యాలెండర్ ను విడుదల చేసింది. ఈ అకడమిక్ ఇయర్లో మొత్తం 227 రోజులను పని దినాలుగా బోర్డు ప్రకటించింది. విద్యార్థులకు 77 రోజులు సెలవులుగా వెల్లడించింది.
నూతన విద్యా సంవత్సరంలో జూన్ 1 నుంచి విద్యా తరగతలు ప్రారంభం అవుతాయని పేర్కొంది. ఇందులో దసరాకు ఆరు రోజులు, సంక్రాంతికి మూడు రోజులు సెలవు దినాలు వుంటాయని చెప్పింది. అక్టోబర్19 నుంచి 25వ తేదీ వరకు దసరా సెలవులు వుంటాయని తెలిపింది.
అదే విధంగా జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని ప్రకటనలో వివరించింది. ఇక ఫిబ్రవరి 2వ వారంలో ప్రాక్టికల్స్, మార్చి మొదటి వారంలో వార్షిక పరీక్షలు ఉంటాయని ఇంటర్ బోర్డ్ స్పష్టం చేసింది.
ఇదిలాఉంటే.. గత నెల 15 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు మొదలై మార్చి 28, 29 తేదీల్లో ముగిశాయి. మార్చి 30 నుంచి విద్యార్థులకు విద్యాశాఖ వేసవి సెలవులను మంజూరు చేసింది. తిరిగి జూన్ 1 నుంచి కాలేజీలు పున: ప్రారంభం కానున్నాయి.