తెలంగాణలో ఆదివారం కరోనా టెస్టులకు సెలవా…? అన్న అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గత కొంతకాలంగా ఆదివారం వచ్చిందంటే చాలు కరోనా టెస్టుల సంఖ్య భారీగా పడిపోతుంది. దీంతో ఆ ప్రభావం సోమ, మంగళవారాలపై పడుతుంది. శనివారం వరకు ప్రతి రోజు దాదాపు 23వేల టెస్టులు చేసిన తెలంగాణ, ఆదివారం ఆ సంఖ్యను 11,609కి తగ్గించేసింది.
ఆదివారం 11,609 టెస్టులు చేయగా… 1256కొత్త కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 80వేలు దాటింది. ప్రస్తుతం 80,751 మొత్తం కేసుల్లో 22,528 యాక్టివ్ కేసులుండగా, 57,586మంది కోలుకున్నారు. తాజాగా మరో 10మంది మరణించటంతో మరణాల సంఖ్య 637కు చేరింది.
తాజాగా వచ్చిన కొత్త కేసుల్లో గ్రేటర్ 389కేసులు రాగా, ఇతర ఏ జిల్లాల్లోనూ కేసుల సంఖ్య 100దాట లేదు. అదిలాబాద్ లో 63కేసులు రాగా, రంగారెడ్డి 86, సంగారెడ్డిలో 74 కేసులొచ్చాయి.