కరోనా వైరస్ తనను మార్చుకొని మరంత వేగంగా వ్యాపిస్తుంది. ఇంగ్లాండ్ లో గుర్తించిన ఈ కొత్త స్ట్రెయిన్ గురించి ప్రపంచం అంతా భయపడుతుంది. యూకే నుండి వచ్చిన ప్రయాణికులను ఇతర దేశాల్లో ట్రేస్ చేయటం, కొత్తగా ఎవర్నీ అనుమతించకుండా చర్యలు తీసుకుంటున్నాయి.
యూకే నుండి డిసెంబర్ 9 తర్వాత తెలంగాణకు దాదాపు 1200మంది వచ్చారని ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో ఇప్పటి వరకు 926మందిని గుర్తించారు. మరో 274మంది వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ 926మందిలో 16మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. పాజిటివ్ వచ్చిన వారిలో హైదరాబాద్ నుంచి నలుగురు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి నలుగురు, జగిత్యాల జిల్లా కు చెందిన ఇద్దరు, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లా నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. వీరని ప్రత్యేక వార్డులో ఉంచి… వీరికి అత్యంత సన్నిహితంగా ఉన్న 76మందిని గుర్తించారు. వారికి క్వారెంటైన్ ఏర్పాటు చేసి వారి ఆరోగ్య పరిస్థితులను గమనిస్తున్నారు.
యూకే నుండి వచ్చి పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిలో కొత్త స్ట్రెయిన్ ఉందా…? పాత కరోనా వైరస్సే ఉందా అని తెలుసుకునేందుకు వారిని నమునాలను సీసీఎంబీకి పంపించారు. మరో రెండ్రోజుల్లో ఫలితాలు రానున్నాయి. దీంతో ఇటు అధికార వర్గాల్లో, అటు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.
డిసెంబర్ 9 తరువాత రాష్ట్రానికి నేరుగా UK నుండి వచ్చిన వారు లేదా UK గుండా ప్రయాణించి వచ్చిన వారు దయచేసి వారి వివరాలను 040-24651119 నంబర్ కి ఫోన్ చేసి లేదా 9154170960 నంబర్ కి వాట్స్ ఆప్ ద్వారా అందిచాలని తెలంగాణ వైద్యారోగ్యశాఖ కోరుతుంది.