నందమూరి బాలకృష్ణ ను తెలంగాణ తెలుగు యువత ప్రతినిధులు కలిశారు. ఈ నెల 24న జరగనున్న తెలంగాణ తెలుగు యువత కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావలసిందిగా కోరారు. ఈ మేరకు తెలంగాణ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ తెలుగు యువత లోగో ను బాలయ్య చేతులు మీదగా ఆవిష్కరించారు.
ఇక నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బిబి3 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.