ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఇతర రంగాల కార్మికులు, ఉద్యోగుల నుండి మద్దతు లభిస్తోంది. డిమాండ్‌ల సాధన కోసం కార్మికులు సమ్మె చేస్తే… ఉద్యోగాలు తీసేయటంపై మండిపడుతున్నారు. అన్ని రాజకీయ పక్షాలు ,వివిధ ప్రజా , ఉద్యోగ , మహిళా సంఘాల నుండి ఆర్టీసీ కార్మికులకు సంపూర్ణ మద్దతు లభిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(STUTS) ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ నెల 10 నుండి 12 వరకు మూడు రోజుల పాటు పరిస్థితులను బట్టి , మీమీ జిల్లాల్లో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె కు మద్దతు ఇస్తూ, ఆర్టీసీ కార్మికుల పోరాటం లో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చింది. ఇలా ఒక్కొక్క సంఘం ఆర్టీసీ సమ్మె కు మద్దతు ఇస్తూ , ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడుతున్నారు.