తెలంగాణలో డిగ్రీ చదువుతున్న ఫైనల్ ఇయర్ విద్యార్థుల పరీక్షలు నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి రెడీగా ఉందని చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 30లోపు డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తి చేస్తామని, విద్యార్థులు చదువుకునేందుకు 15రోజులు మాత్రమే ఉందని ప్రకటించారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితుల దృష్ట్యా ఏ కాలేజీ విద్యార్థులను అదే కాలేజీలో పరీక్ష రాయించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. విద్యార్థులకు ఆన్ లైన్ లో పరీక్ష రాసే అవకాశం లేదన్నారు. అయితే సప్లమెంటరీ పరీక్షలు లేకుండా అందర్నీ పాస్ చేయాలని ఇతర సంవత్సర విద్యార్థులు కోరారని, కానీ పరీక్షలపై తుది నిర్ణయం ప్రభుత్వానిదేనన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు.