తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు ఆలస్యం అవుతున్నాయి. జీతాలు ఫలానా తేదీలో వస్తాయని ఆశించే అవకాశమే లేదు. ఈ నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆర్టీసీలో మొదలుపెట్టిన కొరియర్స్ సప్లైని ఇక తామే హోం డెలివరీ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం రోజుకు 15లక్షలు పార్సిల్ సర్వీసు ద్వారా అర్జిస్తున్నామని, త్వరలోనే 20లక్షలకు చేరుకుంటామన్నారు. గ్రేటర్ లో 1750బస్సులు నడుపుతున్నామని.. త్వరలో వాటి సంఖ్య పెంచుతామన్నారు.
ఇక కరోనా వైరస్ వల్ల ఆర్టీసీ ఆదాయం భారీగా పడిపోయిందని, త్వరలోనే జీతాలు ఆలస్యం కాకుండా చూస్తామన్నారు. ఇప్పుడిప్పుడే సంస్థ ఆదాయం పెరుగుతున్నందున 230కోట్లు సీసీఎస్ కు ఇచ్చామని, ఇంకో 600కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు.