తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.బంగాళాఖాతం పశ్చిమ మధ్య ప్రాంతంపై అల్పపీడనం ఏర్పడింది.
దీనికి అనుబంధంగా సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం విస్తరించింది.ఈ అల్పపీడనం దసరా (బుధవారం) నాటికి ఏపీ తీరం వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
వీటి ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం ఓ మోస్తరుగా.. బుధ, గురువారాల్లో భారీవర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది.
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా నగర ప్రజలు ఈ రెండ్రోజులు అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటకు రావాలని సూచించారు.