తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రంగా పెరిగిపోయిందని, గ్రామీణ ప్రాంతాలలో వీధి వీధికీ బెల్టు షాపులు కూడా పెరిగిపోయాయని, చాలా మంది పిల్లలు మత్తుకు బానిస అయ్యారని టీజేఎస్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే తెలంగాణ పంజాబ్‌ను మించి పోవడం ఖాయమని ఆయన అన్నారు.
తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ బి. కేశవులు అధ్యక్షతన జరిగిన ప్రపంచ మత్తుపదార్థాల వ్యతిరేక దినం సందర్భంగా సోమాజి గూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు..
లిక్కర్ సేల్స్ గతంలో కంటే మూడు వందలు రెట్లు పెరిగాయని లిక్కర్, వైన్స్ షాప్స్, బెల్టుషాపులు నుంచి వచ్చే ఆదాయంపై ఉన్న శ్రద్ధ మానవ ఆరోగ్యాలపై నాయకులకు లేదని అన్నారు, పెన్షన్ డబ్బులు మద్యం తాగడానికి సరిపోతుందని, మరికొన్ని గ్రామాలలో పెన్షన్ డబ్బులు లిక్కర్ ఆదాయం కన్న తక్కువగా ఉందన్నారు. కుటుంబ ఆదాయం మత్తు పదార్థాల సేవనం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నారని అవేదన వ్యక్తం చేశారు.
సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ మేధావుల చైర్మన్ డాక్టర్. బి కేశవులు మాట్లాడుతూ…
పిల్లలు యువత సహా అత్యంత అనారోగ్యాన్ని కల్గించే మాదక ద్రవ్యాల నుంచి మన ఆరోగ్య హక్కును కాపాడవలసిన అవసరం ఉందన్నారు.
మాదక ద్రవ్యాలు అనగా మానవ శరీరానికి మిక్కిలి హాని కలిగించే పదార్ధాలనీ,మాదక ద్రవ్యాల వాడకం అత్యంత ప్రమాదకరమైన వ్యసనమనీ ఈనాటి యువతరాన్ని దారి మళ్లీంచిన ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాల కన్నా మాదక ద్రవ్యాలు తీవ్రమైనవని, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5.6 శాతం జనాభా అలవాటు పడగా. ఇండియా లో 2.1 % శాతానికి పైగా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు చెప్పారు.
ప్రముఖ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని, మద్యం, మత్తు పదార్థాల విషయంలో పంజాబ్ ను మించిపోతున్నదన్నారు.
ప్రజా పక్షం ఎడిటర్, జర్నలిస్ట్ శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుతూ మత్తుపదార్థాల వ్యవహారము దేశంలో అతి పెద్ద భయంకరమైన సమస్యగా మారిపోయిందని రాష్ట్రం మొత్తం మత్తు మయం చేస్తున్నారని తెలిపారు..ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము సామాజిక స్పృహ లేకుండా మత్తుపదార్థాలను పెంచి పోషిస్తున్న దని రాష్ట్రంలో జరిగే అన్ని హింస కార్యక్రమాలకు మత్తుపదార్థాలే కారణమన్నారు.
టి ఎస్ ఎం ఎస్ అధ్యక్షులు కర్ణాకర్ రెడ్డి దేశాయ్ మాట్లాడుతూ రాష్ట్రం ప్రజలకు మత్తు బానిస చేస్తుందన్నారు, తెలంగాణ బహుజన ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ బాల క్రిష్ణ, అమీర్‌పేట బీజేపీ కార్పొరేటర్ కేతినేని సరళ మాట్లాడుతూ నిషేధిత మత్తు పదార్థాల విషయం లో అందరు కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
సోషియల్ లాయర్స్ ఫోరమ్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, టి జే స్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డీ, సామాజిక వేత్త వెంకట్ రెడ్డీ, సాయిని నరెందేర్, బీసీ సంఘం వైస్ ప్రెసిడెంట్, సురేష్ దాసు, గవర్నమెంట్ డాక్టర్ల జేఏసీ చైర్మన్ డాక్టర్ రమేష్, ప్రభుత్వ రంగ సంస్థల అసోసియేషన్ చైర్మన్ బి రాజేశం, మాజీ జాయింట్ కమిషనర్ రవీంద్ర, సంగీత దర్శకులు విష్ణు కిషోర్, సామాజిక వేత్త ప్రొఫెసర్ దొంతి నరసింహారెడ్డి, బహుజన జాగృతి నాయకురాలు శ్రీమతి శారదా, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, తెలంగాణ జర్నలిస్ట్ విఠల్, జర్నలిస్ట్ పార్థసారధి రెడ్డి, రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్ కామేశ్వర రావు, సీనియర్ జర్నలిస్ట్ సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు. పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు