తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై సుప్రీం కోర్టు తీర్పు తర్వాతే క్లారిటీ వస్తుందని, అప్పటి వరకు వేచి చూడాల్సిందేనని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.పాపిరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకునే అవకాశం ఇప్పుడు లేదని, ఈ కేసులో మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలను సుప్రీం కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సూచించినందున ఆ తర్వాతే ఓ నిర్ణయం ఉంటుందన్నారు. ఈ నెల 14న సుప్రీం తీర్పు వెలువరిస్తే ఆ తర్వాత దాన్ని బట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
ఇక వివిధ ప్రవేశ పరీక్షలపై ఈ నెల 17న హైకోర్టులో విచారణ ఉందని, అయితే కోర్టు అనుమతితో ఈనెల 31న ఈసెట్, 9,10,11.14వ తేదీల్లో ఎంసెట్ పరీక్ష నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని పాపిరెడ్డి తెలిపారు. ఈ సెట్స్ నిర్వహించేందుకు కోర్టు అనుమతిస్తే… మిగతా సెట్స్ తేదీలను కూడా ఖరారు చేస్తామని ప్రకటించారు.