తెలంగాణ రాష్ట్రంలో నిలిపేసిన గొర్రెల పంపిణీ కార్యక్రమం వెంటనే చేపట్టాలని గొల్లకురుమలు పోరుబాట పట్టారు. జనగామ జిల్లాలో గొల్లకురుమలు చేపట్టిన జీఎంపీఎస్ మహా పాదయాత్ర విజయవంతమైంది.
గొల్ల కురుమలందరికీ గొర్రెలు ఇస్తామన్న సీఎం కేసీఆర్ హామీని నెరవేర్చాలని జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్ డిమాండ్ చేశారు. గొర్రెలు ఇవ్వకుంటే కేసీఆర్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఆయన హెచ్చరించారు.