యువజన కాంగ్రెస్ చేపట్టిన ఛలో ఇబ్రహీంపట్నం కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా శివసేన రెడ్డి మాట్లాడుతూ… యువజన కాంగ్రెస్ నాయకులపై జరిగిన దాడిని ఖండిస్తూ ఛలో ఇబ్రహీంపట్నం కార్యక్రమం ను చేపట్టామన్నారు.
ఇబ్రహీంపట్నం అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన తెలపడానికి వెళ్తుంటే అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. ఆ తరువాత ఆదిభట్ల పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారని అన్నారు.
యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై దాడికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని హెచ్చరించారు శివసేన రెడ్డి.
కాగా ఈ తోపులాటలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి కాలికి గాయమైంది.