యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ ను అడ్డుకొన్నారు నేతలు. నిరుద్యోగ యువతకు నోటిికేషన్లు, నిరుద్యోగ భృతి పైన వినతి పత్రం సమర్పించడానికి వెళ్ళారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి. ఆసమయంలో శివసేన రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసిన వనస్థలిపురం పోలీసులు స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా శివసేన రెడ్డి మాట్లాడుతూ అరెస్టులు చేయకుండా, పోలీసు బలగాలు లేకుండా పర్యటించే దమ్ము కేటీఆర్ కు లేదని, తక్షణమే ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లు రిలీజ్ చేయలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి 3016/- హామీని అమలు చేయాలని అన్నారు.
ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఇబ్బందిగా మారిన 317 జీవోను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఒకవైపు ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్న ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తుందన్నారు.
ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని లేనిపక్షంలో ప్రజాగ్రహనికి గురికాక తప్పదని హెచ్చరించారు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి.