ఎమ్మెల్సీ కవిత కేసు మీదున్న ఇంట్రెస్ట్.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు యూత్ కాంగ్రెస్ నేతలు. సోమవారం హైదరాబాద్ అబిడ్స్ లోని కలెక్టరేట్ ఎదుట యూత్ కాంగ్రెస్ నిరసన చేపట్టింది.
యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మోత రోహిత్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు రోడ్డుపై బైఠాయించారు యూత్ కాంగ్రెస్ నేతలు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్న పత్రాల లీకేజీపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
పేపర్ లీకేజీకీ బాధ్యులుగా టీఎస్పీఎస్పీ ఛైర్మెన్ జనార్దన్ రెడ్డి ను భర్తరఫ్ చేయాలని యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించడం లేదంటూ మండిపడ్డారు.
రాష్ట్రంలో నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఎమ్మెల్సీ కవితను ఈడీ కేసు నుండి కాపాడుకోవడానికి ఢిల్లీకి వెళ్తున్న రాష్ట్ర మంత్రివర్గానికి.. నిరుద్యోగుల బాధ అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.