పోలీసులు ఎంత పగడ్బందీగా తనిఖీలు చేసినా, చర్యలు తీసుకుంటున్నా.. స్మగ్లర్లు మాత్రం వారి ఆగడాలను ఆపడం లేదు. ఏదో ఒక రూపంలో గంజాయి రాష్ట్రాలు దాటించేస్తున్నారు. తాజాగా తెలంగాణ పోలీసులు అంతర్రాష్ట్ర గంజాయి ముఠాని అరెస్టు చేసింది.
వారి నుంచి 800 కిలోల గంజాయిని సీజ్ చేసింది. పట్టుబడిన గాంజా విలువ సుమారు రెండు కోట్లు వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. శంషాబాద్ ఎస్వోటీ, మియాపూర్ పోలీసులు కలిసి చేసిన ఈ ఆపరేషల్ లో స్మగ్లర్లు పట్టుబడ్డారు.
గంజాయి తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకొని.. వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసుల నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కొత్త పుంతలు తొక్కుతూ స్మగ్లింగ్ చేస్తున్నారని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
స్మగ్లింగ్ చేస్తే శిక్షలపై అవగాహన లేకపోవడం వలన కొంత మంది దీన్ని ఉపాధిగా మార్చుకుంటున్నారని తెలిపారు. కౌన్సిలింగ్ ఇస్తున్నా.. తీరుమారడం లేదని అంటున్నారు.