నలుగురి ముందు మాట్లాడ్డం అంటే నాలుగు యుద్దాలు చేసినట్టే. అలాంటిది వందల మంది అటెన్షన్ని మనవైపు తిప్పుకోవాలంటే ఎన్నితిప్పలు పడాలి. ఎంతో టాలెంట్ కావాలి. కానీ యాంకర్లకి మాట్లాడ్డం అంటే మంచినీళ్ళు తాగినంత ఈజీ.
తమ మాటలతో హావభావాలతో, సెన్స్ఆఫ్ హ్యూమర్ తో ఆడియన్స్ ని కట్టిపడేస్తారు . కేవలం వాళ్ళు యాంకరింగ్ చేయడం వల్ల హిట్ అయిన టీవీ షోలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో కొంతమంది బుల్లితెర యాంకర్లకైతే సినిమా స్టార్లకున్న ఫాలోయింగ్ ఉంది.
అందుకే అటు సినిమాల్లోనూ ఇటు టీవీషోల్లోనూ దూసుకుపోతున్నారు. ఇక బుల్లి తెరపై సందడి చేసే యాంకర్లు కూడా తమ సత్తాకి సక్సెస్ కీ తగ్గిన రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
తమ అభిమాన యాంకర్లు తీసుకునే పారితోషకం తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది. విశ్వసనీయ సమాచారం మేరకు. యాంకర్ల ఆడియో పంక్షన్,షోలకు యాంకరింగ్ రెమ్యునిరేషన్ తెలుసుకుందాం.
1) తెలుగులో టాప్ యంకర్ గా కొనసాగుతున్న సుమ కనకాల 2.5 లక్షల రెమ్యునరేషన్ పుచ్చుకుంటోంది. సుమ ప్రస్తుతం సినిమాలోనూ నటిస్తోంది.
2) యాంకర్ మంజూష ప్రస్తుతం 30వేల రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఇంటర్య్వూలలో ఎక్కువగా మంజూష కనిపిస్తూ ఉంటుంది.
3) యంకర్ రవి ప్రస్తుతం లక్షరూపాయల రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడు. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నాడు.
4) యాంకర్ వర్షిణి 30వేల రెమ్యునరేషన్ తీసుకుంటోంది. జబర్దస్త్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.
5) యాంకర్ శ్యామల ప్రస్తుతం 50వేల రెమ్యునరేషన్ తీసుకుంటోంది. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది.
6) యాంకర్ ప్రదీప్ మేల్ యాంకర్స్ లో టాప్ స్థానంలో ఉంటాడు. ప్రదీప్ లక్ష రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.
7) అప్పుడప్పుడూ కనిపించే శిల్పా చక్రవర్తి 25వేల నుండి 50 వేల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటుంది.
8) జబర్దస్త్ బ్యూటీ రష్మి లక్ష యాబైవేల నుండి లక్షా డెబ్బై ఐదు వేల వరకూ రెమ్యునరేషన్ పుచ్చుకుంటోంది.
9) మరో జబర్దస్త్ యాంకర్ అనసూయ రెండు లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ప్రస్తుతం అనసూయ సినిమాల్లో బిజీగా ఉంది.
10) రీసెంట్ జబర్దస్త్ కొత్త జడ్జిగా సీరియల్ నటి సౌమ్య రావు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా సౌమ్యరావ్ కు కూడా మల్లెమాల వారు రెమ్యునరేషన్ గట్టిగానే ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కో ఎపిసోడ్ కు సౌమ్యరావు రూ.60 వేలు తీసుకుంటున్నట్టు టాక్.