మన తెలుగులో యాంకర్లకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయ భాను యాంకర్ గా ఒక వెలుగు వెలిగిన తర్వాత చాలా మంది యాంకరింగ్ వైపు ఆసక్తి చూపించారు. తమకు వచ్చిన అవకాశాలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు యాంకర్ లు గా సుమాతో పాటుగా కొందరు బాగా హాట్ టాపిక్ అవుతున్నారు. ఇక మన తెలుగు యాంకర్ లు ఏం చదివారో ఒకసారి చూద్దాం.
Also Read:ఏడుగురు జడ్జీల ప్రమాణస్వీకారం
సుమా
కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు, సీరియల్స్ లో పాత్రలు చేసిన యాంకర్ సుమా ఎంకామ్ వరకు చదివారు. ఆ తర్వాత బుల్లితెరలో సెటిల్ అయ్యారు.
ఝాన్సి
తెలుగులో నటిగానే కాకుండా యాంకర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్న… ఝాన్సి బీటెక్ చేసింది. అ తర్వాత గ్లామర్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది.
ఉదయ భాను
యాంకరింగ్ ప్రపంచంలో కొన్నాళ్ళ పాటు ఒక వెలుగు వెలిగిన ఉదయ భాను చదువు పరంగా చూస్తే ఆ రోజుల్లో మంచి చదువే చదివారు. ఆమె ఎంయే చదివి తర్వాత స్క్రీన్ కు పరిచయం అయ్యారు.
ప్రదీప్
తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ వరుస అవకాశాలతో యాంకర్ గా మంచి స్థానంలోకి వచ్చాడనే చెప్పాలి. ఇతను విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసాడు.
అనసూయ
తెలుగులో ఇప్పుడు ఈమెకు ఉన్న డిమాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈమె చదువు విషయానికి వస్తే… ఎంబీయే పూర్తి చేసి తర్వాత న్యూస్ యాంకర్ అయింది.
రష్మీ
తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న యాంకర్లలో రష్మీ కూడా ఒకరు. జబర్దస్త్ షో తో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. డిగ్రీ పూర్తి చేసి గ్లామర్ ప్రపంచం వైపు అడుగులు వేసింది.
Also Read:హీరో వేణు ఇప్పుడేం చేస్తున్నట్టు…?