రేటింగ్స్ లో దూసుకపోయే రియాలిటీ షోగా పేరున్న షో బిగ్ బాస్. స్టార్ మాలో బిగ్ బాస్ 4 సీజన్ కు సర్వం సిద్ధం చేస్తున్నారు నిర్వహాకులు. అన్నపూర్ణ స్టూడియోస్ లో గతంలో ఉన్న బిగ్ బాస్ సెట్ లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్విమ్మింగ్ పూల్ పెంచటంతో పాటు లివింగ్ రూం, ఇతర చిన్న చిన్న మార్పులు జరుగుతున్నాయట.
నిజానికి జూన్ లోనే షో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా… జులైకి వాయిదా పడింది. ఆగస్టు నుండి షో టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉండగా, సీజన్ 4కి ఎన్టీఆర్ మళ్లీ వస్తాడన్న ప్రచారం జరిగినప్పటికీ నాగార్జుననే హోస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈసారి సింగర్ మంగ్లీ, యాంకర్ వర్షిణీ, కుమారి 21ఎఫ్ ఫేం తరుణ్ ఫిక్స్ అయినట్లు ప్రచారం సాగుతోంది. ప్రముఖ కమెడియన్ హైపర్ ఆదితో కూడా చర్చలు జరుగుతున్నాయన్న ప్రచారం ఉంది.
తెలంగాణ ప్రభుత్వం షూటింగ్ లకు అనుమతి ఇవ్వగానే బిగ్ బాస్ పనులు వేగవంతం కానున్నాయి.