ఒకప్పుడు తెలుగులో కామెడి చేసే వారు అంటే చాలా మంచి ఇమేజ్ ఉండేది. కాని ఆ తర్వాత హీరోలే కామెడి చేయడంతో కమెడియన్ ల హవా బాగా తగ్గింది అనే చెప్పాలి. ఇక తెలుగులో చాలా మంచి కమెడియన్ లు ప్రేక్షకులను అలరించారు. అలా అలరించి ప్రాణాలు కోల్పోయిన వారిని ఇంకా ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఒకసారి వారి జాబితా చూస్తే…
Also Read:పుష్ప మేనియా.. యూపీ ఎన్నికల్లో శ్రీవల్లి సాంగ్..!
ధర్మవరపు సుబ్రహ్మణ్యం: తెలుగులో ఈయనకు ఎంత ఫాస్ట్ గా గుర్తింపు వచ్చిందో అందరికి తెలిసిందే. మంచి టైమింగ్ తో ఎలాంటి సీన్ లో అయినా కామెడి చేయగలడం ఆయన సొంతం. అమాయకమైన ముఖం తో అందమైన కామెడి చేసే వారు. ఆయనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉండేది. ప్రకాశం జిల్లాలో పుట్టి సినిమాల మీద ఆసక్తితో సినిమాల్లోకి వచ్చారు.
ఏవియస్: అద్భుతమైన కామేడితో ప్రేక్షకులను అలరించిన ఈయన గారు మంచి రచయిత కూడా. డిగ్రీ చదివే రోజుల్లోనే నాటకాల్లోకి వచ్చి ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టారు. 19 ఏళ్ళ కెరీర్ లో ఏకంగా 500 సినిమాల్లో నటించారు.
వేణు మాధవ్; తెలుగులో వేణు మాధవ్ అంటే తెలియని వారు ఉండరు. నల్గొండ జిల్లాకు చెందిన వేణుమాధవ్… కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సాంప్రదాయం సినిమా ద్వారా 1996 లో సినిమాల్లోకి వచ్చారు.


ఎంఎస్ నారాయణ; ప్రొఫెసర్ గా చేస్తూ సినిమాల మీద ఇష్టంతో సినిమాల్లో అడుగు పెట్టి… ఇడియట్, బన్నీ వంటి చాలా సినిమాల్లో మర్చిపోలేని పాత్రలు చేసారు. ఆయన తన కెరీర్ లో దాదాపుగా 800 సినిమాల్లో నటించారు. త్రివిక్రమ్, శ్రీను వైట్ల సినిమాల్లో ఆయన చేసిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది.
జయప్రకాష్ రెడ్డి; ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి… విలన్ గానే కాకుండా కామెడి కూడా చేసి తన మార్క్ చూపించారు. ఏ సినిమా అయినా సరే ఆయన ఉంటే ఆ పాత్ర కచ్చితంగా హిట్ అవుతుంది. విలనిజం లో కామెడి చేసి కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు.
ఆహుతీ ప్రసాద్; ఏ యాస లో అయినా సరే ఈయన చేసే కామెడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆహుతి సినిమాలో ఆయన పాత్ర హిట్ కావడంతో ఆ పాత్ర పేరునే ఇంటి పేరుగా పెట్టుకున్నారు. ఏ పాత్ర చేసినా సూపర్ హిట్.
మల్లి ఖార్జున; వెంకీ సినిమాలో జగదాంబ చౌదరి గా మంచి పాత్ర పోషించిన ఆయన ఆ పాత్రలో మంచి కామెడి చేసారు. చాలా సినిమాల్లో మంచి పాత్రలతో అలరించారు.
కొండవలస; తెలుగు సినిమాకు దొరికిన మరో బంగారం లాంటి కమెడియన్ కొండవలస. చాలా సినిమాల్లో ప్రత్యేక మేనరిజం తో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.
గుండు హనుమంత రావు; బుల్లి తెరతో పాటు వెండి తెర మీద కూడా మంచి కామెడి చేసి అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు.
Also Read:న్యూ లుక్ లో థమన్…35 కిలోలు వెయిట్ లాస్