సీఎం జగన్‌కు శ్రీరెడ్డి సలహాలు-సూచనలు - Tolivelugu

సీఎం జగన్‌కు శ్రీరెడ్డి సలహాలు-సూచనలు

సీనీ పరిశ్రమలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటి శ్రీరెడ్డి ఇప్పుడు రాజకీయాలపై దృష్టిపెట్టినట్లు కనపడుతోంది. ఇన్నాళ్లు సినీ రంగంలో ఉన్న ప్రముఖులను టార్గెట్ చేసి వారి గుట్టు విప్పే పనిచేసిన శ్రీరెడ్డి, ఇప్పుడు వైసీపీపై ఆరోపణలు సంధిస్తోంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజాపై కామెంట్స్ చేయగా, ఇప్పుడు నేరుగా సీఎం జగన్‌నే టార్గెట్ చేసింది. రాష్ట్రానికి త్వరగా పెట్టుబడులు రాబట్టాలని, పెట్టుబడులు వస్తే సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పింది.

పనిలో పనిగా ఇటీవల కంచెరపాలెం సెక్స్ రాకెట్ ముఠాను గుట్టురట్టు చేసిన పోలీస్‌లపై శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. వ్యభిచారం అనేది ఒ సమాజ సేవ లాంటిదని, అక్కడితో ఆగకుండా వేశ్యల్ని దేవతలతో పోలుస్తూ…. ఫెస్‌బుక్ పోస్ట్‌ పెట్టింది. దీనిపై నెటిజన్లు కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp