ఏపీ ప్రభుత్వంపై నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.
సినీ పరిశ్రమకు రెండు ప్రభుత్వాల మద్దతు అవసరమని ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది. ప్రభుత్వాల మద్దతు లేకుండా సినీ పరిశ్రమ మనుగడ కష్టమని వెల్లడించింది.‘‘ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ కష్టాలలో ఉంది. సినీ పరిశ్రమపై ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. వ్యక్తిగత అభిప్రాయాలను వివిధ వేదికలపై చెబుతున్నారు. వ్యక్తిగత అభిప్రాయాలతో మాకు సంబంధం లేదు’’ అని ఫిల్మ్ ఛాంబర్ ఆప్ కామర్స్ స్పష్టం చేసింది.