ఇటీవల కాలంలో థియేటర్ లో టికెట్ ధరలు, అలాగే థియేటర్లను సీజ్ చేయడం ఇవన్నీ కూడా ఏపీ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే సీజ్ చేసిన థియేటర్లు తిరిగి ఒపెన్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ కృతజ్ఞతలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.
థియేటర్స్ రీ ఒపెనింగ్ కి అనుమతి నిచ్చిన ఆంధ్రప్రధేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్‌మోహన్ కి, సినిమాటోగ్రఫి మంత్రి వర్యులు శ్రీ పేర్ని నాని కి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ తరపున కృతజ్ఞతలు తెలిపింది. మిగతా విన్నపాల పట్ల కూడా సానుకూలంగా స్పందించి మమ్మల్ని ఆదుకుంటారని ఆశిస్తున్నాము అంటూ తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ పేర్కొంది.