ఎమ్మెల్యే కొడుకు నా చెయ్యి పట్టి లాగాడు.. - Tolivelugu

ఎమ్మెల్యే కొడుకు నా చెయ్యి పట్టి లాగాడు..

Ex-MLA's Son Misbehaves With Bigg Boss 2 Sanjana, ఎమ్మెల్యే కొడుకు నా చెయ్యి పట్టి లాగాడు..

తనను, తన స్నేహితులను మాజీ ఎమ్యేల్యే కొడుకు చెయ్యి పట్టి లాగాడని..అసభ్యంగా ప్రవర్తించాడని తెలుగు సినీ నటి సంజన పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను తన స్నేహితులిద్దరితో కలిసి మాదాపూర్ లోని నోవాటెల్ హోటల్ కు వెళ్లామని..హోటల్ లోని ఓ కార్నర్ లో కూర్చొని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుండగా సడెన్ గా వచ్చిన పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్‌ గౌడ్… అతని స్నేహితులు వస్తూ వస్తూనే తమను చేయి పట్టి లాగాడని..అసభ్య పదజాలంతో దూషించాడని మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసాలను కింద పగులగొడ్తు పెద్దగా అరుస్తూ తమను కొట్టేంత పనిచేశాడని ఫిర్యాదులో పేర్కొంది. బౌన్సర్ అక్కడే ఉండి కూడా మౌనంగా నిల్చున్నాడని..వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని బౌన్సర్ తమకు చెప్పారని తెలిపారు.
ఎమ్మెల్యే కొడుకు ఆశీష్‌ గౌడ్, అతని స్నేహితులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని..లేకపోతే తనకు ఏం జరిగినా ఆ ఎమ్మెల్యే కుమారుడే కారణమని ఫిర్యాదులో సంజన పేర్కొన్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp